Mokshagna: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అంటూ ఎదురుచూడని నందమూరి అభిమాని లేడు. ఈ ఏడాది అంటే ఈ ఏడాది అంటూ ఊరిస్తున్నారే తప్ప కనీసం మోక్షజ్ఞ ఎంట్రీపై ఇసుమంతైనా అప్డేట్ ఇవ్వడంలేదు. ఇక మోక్షజ్ఞ లుక్ చూస్తుంటే బాబు ఇంకా ఫామ్ లోకి వచ్చినట్లు అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి, మోక్షజ్ఞ సినీ, రాజకీయ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
“మోక్షజ్ఞ ఏంటి ఇంకా చాలా సమయం ఉంది. ఇందుకో రెండు మూడేళ్లు పట్టేలా ఉంది. ఇప్పటికే రావాల్సింది కానీ నందమూరి కుటుంబం కొద్దిగా ఆలస్యంగా చేద్దామని చెప్తున్నారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ ఎంతో బావుంటుంది. పెద్ద స్టార్ హీరో అవుతాడు. సినిమాల్లో గుర్తుండిపోతాడు.. సినిమాల్లోనే రాణిస్తాడు. రాజకీయ ఎంట్రీ అయితే మోక్షజ్ఞ చేయడు. నటనలోనే కొనసాగిస్తాడు. నాకు తెలిసినంత వరకు సినిమాలే మోక్షజ్ఞను నిలబెడతాయి”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు వస్తాడో లేడో అని అనుకున్నాం.. మీరు చెప్పిన మాటల్తో ఆ డౌట్ తీరిపోయింది అని కొందరు.. సామ్- చై విషయంలో మీరు చెప్పింది నిజమైంది కాబట్టి ఇది కూడా నిజం అవుతుందని నమ్ముతున్నాం అని మరికొందరు చెప్పుకోసిస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ డైరెక్టర్ తో ఉండబోతుందో చూడాలి.
