Site icon NTV Telugu

Venu Swami : ట్రోల్స్‌కి నెగటివ్ రివ్యూస్‌కి విజయ్ దేవరకొండ నాశనం అయ్యాడు!

Venu Swami On Vijay Deverakonda

Venu Swami On Vijay Deverakonda

Venu Swami Comments on Vijay Deverakonda The Family Star: వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ జరిగిందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో నెగిటివ్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున సినిమాని నష్ట పరిచిందని అన్నారు. వాళ్ళని నెగిటివ్ పబ్లిసిటీ చేసి గుంటూరు కారం సినిమాని ఒక ఫెయిల్యూర్ అని చూపించారు. ఎందుకు నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు పెట్టారు.

Prathinidhi 2 : ఎన్నికల్లోపే ప్రతినిధి కూడా.. ఆరోజే రిలీజ్

ఇది బేకార్ సినిమా అని చూడాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూస్ బయటకు వచ్చాయి. మీమ్స్ కి, ట్రోల్స్ కి, నెగిటివ్ రివ్యూస్ కి విజయ్ దేవరకొండ బలైపోయాడు. ఈ సినిమా నాశనం అవ్వడానికి కారణాలు అవే ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందే నెగటివ్ రివ్యూస్ యూట్యూబ్లో హల్చల్ చేశాయి. సినిమా బాలేదు, బాలేదు, రాడ్ దించాడు రాడ్ దించాడు అంటూ నెగిటివ్ పబ్లిసిటీ చేయడంతో సినిమా చూడాలనుకున్న వాళ్లు కూడా చూడలేదు. అలా ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండకి పెద్ద నష్టమే జరిగింది. అంటూ వేణు స్వామి కామెంట్ చేశాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ జాతకం తాను చూడలేదని, వాళ్ళ పెద్దమ్మ చెప్పడం కరెక్ట్ కాదని ఆమెకు తెలియదు, కానీ తాను ప్రభాస్ జాతకం చూశానని చెప్పుకొచ్చాడు.

Exit mobile version