Site icon NTV Telugu

Venu Swami: ప్రభాస్‌కి, పెద్దమ్మకి సంబంధం లేదు.. జాతకం చూశా.. వేణుస్వామి మరో సంచలనం!

Venu Swamy

Venu Swamy

Venu Swami Comments on Prabhas again: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వారి జాతకాల గురించి కామెంట్ చేస్తూ అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు స్వామి అనే జ్యోతిష్యుడు. ముఖ్యంగా ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదు ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు అందరూ జాతకాలు చూపించుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులు ఆయనను టార్గెట్ చేసేలా చేశాయి. ఆ తర్వాత కూడా పలుసార్లు ప్రభాస్ అభిమానులను ప్రభాస్ టీంని ఇరుకున పెట్టేలా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయి. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల అసలు ప్రభాస్ జాతకం నా దగ్గరే లేదు, వేణు స్వామి దగ్గర ఉందని ఎలా అనుకుంటున్నారు? బహుశా ఆయన ప్రచారం కోసమే అలా చెప్పుకుంటున్నారు ఏమో అంటూ కామెంట్ చేసింది.

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీకి దిగుతున్న తమన్నా

అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం మీద వేణు స్వామి స్పందించాడు. ప్రభాస్ కి ఆయన పెద్దమ్మకి సంబంధం లేదు. చాలామంది బంధువులే అంటారు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు నేను చెప్పదలుచుకోవడం లేదు. చాలామంది ఆయన పెద్దమ్మే కదా ఆమెకు తెలియకుండా ఉంటుందా? అంటారు కానీ నా వరకు నేను ప్రభాస్ తల్లి గారికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రభాస్ జాతకం వేరే వారి ద్వారా నా దగ్గరకు వచ్చింది, నేను జాతకం చూసి చెప్పాను కానీ అది ఎవరి ద్వారా వచ్చింది అనేది మాత్రం నేను చెప్పను. అయితే కృష్ణంరాజు గారి భార్య శ్యామల కూడా నా దగ్గరకు వచ్చారు. అయితే అది ప్రభాస్ విషయంలో కాదు. కృష్ణంరాజు గారు గవర్నర్ అవుతారా? లేదా? అనే విషయం తెలుసుకోవడానికి వచ్చారు. అయితే అసలు నేనేమీ ఆమెకు తెలియదు అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

Exit mobile version