Vennela Kishore Gunthalakadi Gurunadham Ego Kaa Baap’ GURU
హీరో నితిన్ నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీలో నటిస్తున్న ‘వెన్నెల’ కిశోర్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో గుంతలకడి గురునాధం అనే పాత్రలో కనిపించబోతున్నారు ‘వెన్నెల’ కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది. అంతేకాదు ఆయన పాత్రకు ‘ఇగో కా బాప్’ అనే క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా వుంది. ‘ఇగో కా బాప్’ క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో ‘వెన్నెల’ కిషోర్ చాలా సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఇగోయిస్టిక్ ఎక్స్ ప్రెషన్ ఆయన పాత్రపై ఆసక్తిని పెంచింది. కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ ‘రారా రెడ్డి’లో సందడి చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ లిరికల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.
