Kalyan Ram: సంక్రాంతి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ మాత్రమే కాదు, భారీ సినిమాల సందడి కూడా. ప్రతి ఏడాది స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంటాయి. ఇప్పుడు 2027 సంక్రాంతి కోసం కూడా మరో క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తుండటం ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం #VenkyAnil5, #NKR22 వర్కింగ్ టైటిల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది. అనిల్ రావిపూడి స్టైల్‌కు తగ్గట్టుగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పండుగ వాతావరణం కలగలిపిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈవాల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన పూర్తిగా పండుగ మూడ్‌లో కనిపించారు. పంచా, కుర్తా ధరించి, మెడలో పూలదండ, కళ్లకు స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో కళ్యాణ్ రామ్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ఒక్క ఎనర్జీ పోస్టర్‌తోనే సినిమాలోని పండుగ వాతావరణాన్ని చిత్రబృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే సందర్భంగా కళ్యాణ్ రామ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా ప్రారంభించారు. @nandamurikalyanram పేరుతో ప్రారంభించిన అకౌంట్‌లో తొలి పోస్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. “అనిల్ రావిపూడి జోన్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సంక్రాంతి 2027కి ఒక అద్భుతానికి సిద్ధంగా ఉండండి” అంటూ చేసిన పోస్టు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించనుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉండేలా కథను అనిల్ రావిపూడి తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా, ఛాయాగ్రాహకుడిగా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు. అనిల్ రావిపూడి గత చిత్రాల విజయాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా కూడా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌కు అనిల్ రావిపూడి వినోదాత్మక టచ్ తోడవడంతో, సంక్రాంతి 2027 బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రకార్డుల వరద సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Team #VenkyAnil5 #NKRAR2 wishes their beloved @NANDAMURIKALYAN a very Happy Birthday ❤️🔥
Presenting him in his most stylish avatar yet with unmatched elegance and swagger💥
SANKRANTHI 2027 Release.
Victory @VenkyMama @AnilRavipudi @KeerthyOfficial… pic.twitter.com/znmUJZn4gB
— Shine Screens (@Shine_Screens) July 5, 2026

