NTV Telugu Site icon

VenkyAnil3 : వెంకీ మామ కోసం రంగంలోకి ‘రమణ గోగుల’

Ramana Gogula

Ramana Gogula

సంగీత దర్శకుడు రమణ గోగుల ఇప్పటి యూత్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఓ 20 ఏళ్ల కిందట తన మ్యూజిక్ తో రమణ గోగుల చేసిన సెన్సేషన్ రాతల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే వంటి సాంగ్స్ తో అప్పటి యూత్ ను ఉర్రుతలూగించాడు రమణ గోగుల. మ్యూజిక్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించేవారు రమణ గోగుల. పవర్ స్టార్ తో బద్రి, తమ్ముడు, వెంకీ తో లక్ష్మి, రెబల్ స్టార్ తో యోగి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు రమణ గోగుల.

Also Read : SK : శ్రీమతికి శివకార్తికేయన్ స్వీట్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల మరోసారి తన స్వరాన్ని వినిపించబోతున్నారు. అవును ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్మొదెలెట్టారు. అందులో భాగంగా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని గోదారి గట్టు మీద అంటూ సాగే పాటను రమణ గోగుల ఆలపించనున్నారు. ఈ పాటకి, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయనున్నారు. కాగా వెంకీ నటించిన లక్ష్మీ  సినిమాకు చివరిగా సంగీతం అందించారు రమణ గోగుల. 18 ఏళ్ల తర్వాత వెంకటేశ్‌ – రమణ గోగుల కలయికలో రానున్న ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.  వెంకీకి  జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌  నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Show comments