Site icon NTV Telugu

Venky Re Release: అరేయ్ ఎవర్రా మీరంతా.. ఏంట్రా ఈ అరాచకం

Venky

Venky

Venky Re Release: ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలామంది కుటుంబాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస.. ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. కుటుంబం మొత్తం ఎన్నిసార్లు సినిమాకు వెళ్లినా మనసంతా ఆనందం నింపుకొని, కష్టాలను, కన్నీళ్లను మర్చిపోయి.. థియేటర్ బయటకు నవ్వుకుంటూ వచ్చేవారు. ఇక ఆ సినిమాలే సినిమాలు. అలాంటి వాతావరణాన్ని మరోసారి తీసుకొచ్చింది వెంకీ రీరిలీజ్. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, స్నేహ జంటగా నటించారు. ఇక
ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణు మాధవ్ కామెడీ వేరే లెవెల్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ రవితేజ కెరీర్ బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే.. టాప్ 5 లో వెంకీ కచ్చితంగా ఉంటుంది. ఇక ఈ సినిమా ఈరోజు రీరిలీజ్ అయ్యి థియేటర్స్ ను షేక్ చేస్తుంది.

సాధారణంగా కొత్త సినిమా మొదటి షో ఎలా ఉంటుందో.. వెంకీ రీ రిలీజ్ షో అలా ఉంది. ముఖ్యంగా బ్రహ్మానందం ఎంట్రీకి అయితే థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా మొత్తం ప్రతి డైలాగ్ నుంచి సాంగ్స్ వరకు ఫ్యాన్స్ కోరస్ ఇచ్చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ట్రైన్ సీన్ లో వేణు మాధవ్ వాడిన తబలాను థియేటర్ లోకి తీసుకొచ్చి సాంగ్స్ పాడుతున్నారు. అసలైన సినిమా అభిమానం అంటే ఇది. ఒక సినిమాకు ఈ రేంజ్ లో హల్చల్ చేస్తున్నారంటే.. అరేయ్ ఎవర్రా మీరంతా.. ఏంట్రా ఈ అరాచకం అనే మాటలు చాలా తక్కువ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. వెంకీ రీ రిలీజ్ కు ఫ్యాన్స్ థియేటర్ లో ఎంత రచ్చ చేస్తున్నారో ఈ వీడియోలు చెప్తున్నాయి.

Exit mobile version