Venky Re Release: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఎప్పటికప్పుడు మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే రీరిలీజైన పలు సినిమాలు మరోసారి మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్న వైనం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ సినిమాను కూడా రీరిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రేక్షకుల తరపున బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటైన ‘వెంకీ’ సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో పట్టుపడుతుండగా ఇప్పటికి అధికారిక ప్రకటన వచ్చేసింది. నిజానికి సినిమాలోని కామెడీ సన్నివేశాలు నేటికీ మీమ్స్ ద్వారా ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉన్నాయంటే ఆ సినిమా జనాల్లో ఎంతగా నాటుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు.
Prakash Raj: మహాత్ముని హత్యను సమర్థించేవారు.. మళ్లీ మొదలెట్టిన ప్రకాష్ రాజ్
ఇప్పటికే ‘వెంకీ’ సినిమాకు రీ-రిలీజ్ పనులు ప్రారంభమవ్వగా ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 30, 2023న రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ హీరోగా, స్నేహ హీరోయిన్ గా నటించిన ‘వెంకీ’ సినిమా 2004లో రిలీజైంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఆ ఏడాది మార్చి 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ అప్పట్లో కమర్షియల్‌గా మంచి హిట్ ను నమోదు చేయగా కామెడీ కింగ్స్ రవితేజ, బ్రహ్మానందంల కాంబినేషన్స్ సీన్స్ ఈ సినిమాకు పెద్ద అస్సెట్ గా మారాయి. అలాగే ట్రైన్ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.