30 ఏళ్ళ వెంకటేశ్ చంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జనవరి 10తో చంటికి 30 ఏళ్ళు)
చంటి పిల్లలంటే జనానికి భలే ఇష్టం. అలాగే చంటిఅన్న పేరు కూడా తెలుగువారికి ఎంతో ఇష్టమైనది. అదే తీరున చంటి అన్న పేరుతో తెలుగునాట తెరకెక్కిన తొలి చిత్రాన్ని జనం విశేషంగా ఆదరించారు. వెంకటేశ్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించిన చంటి చిత్రం 1992 జనవరి 10న విడుదలై సంక్రాంతి సంబరాల్లో విజేతగా నిలచింది. వెంకటేశ్ ను తన తరం హీరోల్లో రీమేక్స్ కింగ్గా నిలిపిన చిత్రం కూడా చంటియే! ఆ తరువాత అనేక రీమేక్స్ తో సక్సెస్ రూటులో సాగిపోయారు వెంకటేశ్. మీనా నాయికగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్. తమిళనాట శివాజీగణేశన్ తనయుడు ప్రభు, ఖుష్బూ జంటగా నటించిన చిన్నతంబి ఈ చిత్రానికి మాతృక.
చంటి కథ కూడా చందమామ కథలను పోలి ఉంటుంది. ఓ రాజు తన కూతురుకు ప్రమాదం సంభవిస్తుందని భావించి, ఆమెను ఎవరి కంటా పడనీయకుండా ఒంటి స్తంభం మేడలో పెంచినట్టుగానే ఈ కథ మొదలవుతుంది. ఓ జమీందార్ల ఇంట ముగ్గురు అన్నలకు ఓ ముద్దుల చెల్లెలు ఉంటుంది. వారి ఇంటి జ్యోతిషుడు ఆమె పెళ్ళి ఓ సామాన్యునితో జరుగుతుందని చెబుతాడు. దాంతో ఆ అన్నలు తమ చెల్లెలు నందిని ఎవరి కంటా పడనీయకుండా పెంచుతూ ఉంటారు. ఆ ఊరిలో చంటి అనే అబ్బాయికి పెద్దగా చదువు లేకపోయినా, రాగయుక్తంగా పాటలు పాడే సహజ లక్షణం ఉంటుంది. అతను ఎంతో అమాయకుడు. దాంతో అందరూ అతని పాటను అభిమానిస్తూంటారు. జమీందార్ల చెల్లెలు సీమంతానికి చంటి పాటపాడతాడు. అతని అమాయకత్వం చూసి, తమ చెల్లెలుకు ఓ బాడీ గార్డ్ లా ఉంచుతారు అన్నలు. తొలిసారి ఇంట్లోంచి పారిపోయి, బయట ఉండే అందాలను చూస్తుంది. అందుకు చంటి సాయం తీసుకుంటుంది. ఓ సారి అనుకోకుండా చంటి, నందినిని రక్షించబోయి ఆమెను తాకుతాడు. దాంతో అన్నలు చితక్కొడతారు. అసలు విషయం తెలుసుకున్న తరువాత నుంచీ చంటిని మళ్ళీ తమ ఇంటికి రమ్మని తీసుకువెళతారు అన్నలు. చంటిపై నందిని మనసు పారేసుకుంటుంది. అతణ్ణే భర్తగా భావిస్తుంది. అతనితో తాళి కూడా కట్టించుకుంటుంది. ఈ విషయం అన్నలకు తెలిసి, చంటి తల్లిని అవమానిస్తారు. దాంతో చంటి నందిని అన్నలను చితకబాదుతాడు. చంటి లేని తన జీవితం వ్యర్థమనుకున్న నందిని విషం తాగుతుంది. నందిని అన్నలు తమ తప్పు క్షమించమని చంటిని, ఆమె తల్లిని వేడుకుంటారు. చంటి వచ్చి తన పాటతో ప్రియురాలు నందినికి స్పృహ తెప్పిస్తాడు. తరువాత చంటి, నందిని ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద... హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
- Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు... ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
ఈ కథ నిజంగా ఓ జానపదం లాగే ఉంటుంది. అయినా, ఇళయరాజా స్వరకల్పనలో చంటి కథ విజయపథంలో నడిచిందని చెప్పవచ్చు. తమిళ మాతృక అయిన ఈ కథ, తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇదే కథతో కన్నడలో రవిచంద్రన్ హీరోగా రామాచారి రూపొంది, అక్కడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వెంకటేశ్ తోనే హిందీలో ఆయన తండ్రి డి.రామానాయుడు ఈ కథను అనాడీ పేరుతో రీమేక్ చేశారు. కె.మురళీమోహన రావు దర్శకత్వంలో రూపొందిన ఆ హిందీ చిత్రం కూడా హిట్ అయింది. ఇలా ఓ అమాయకపు పాటలు పాడే చంటి కథ పలు భాషల వారిని మెప్పించింది.
ఈ చిత్రంలో చంటి తల్లిగా సుజాత నటించారు. నందిని అన్నలుగా నాజర్, వినోద్, ప్రసన్నకుమార్ కనిపించారు. మంజుల, సుధారాణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అనుజ, మహర్షి రాఘవ, మాస్టర్ రాఘవేంద్ర, మాస్టర్ సతీశ్, మాస్టర్ బిజ్జు, మాస్టర్ సురేశ్, బేబీ శ్రీలేఖ, బేబీ సులేఖ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు కథను అందించారు. ఈయన దర్శకత్వంలోనే తమిళ చిన్నతంబి తెరకెక్కింది. తెలుగులో సత్యమూర్తి సంభాషణలు రాశారు. ఈ చిత్రానికి వేటూరి, సాహితీ పాటలు పలికించారు. అన్నుల మిన్నుల అమ్మడికన్నులు..., ఎన్నెన్నో అందాలు..., ఇది తైలం పెట్టి తాళంవేసే.., పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం... పాటలు అలరించాయి. జాబిలికి వెన్నెలకి... అనే పాట రెండు వర్షన్స్ ఉంటుంది. అలాగే ఓ ప్రేమా... అంటూ సాగే పాట కూడా రెండు వర్షన్స్ లో వినిపిస్తుంది. మొత్తం 8 పాటలున్న ఈ చిత్రం ఆడియో కూడా పెద్ద హిట్ గా నిలచింది.
ఈ సినిమాకు నాలుగు నంది అవార్డులు లభించాయి. వాటిలో వేటూరి రాసిన పావురానికి పంజరానికి... పాట ద్వారా ఆయనకు ఉత్తమ గేయరచయితగా అవార్డు లభించింది. ఉత్తమగాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ విలన్ గా నాజర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా శోభాలత నందులు అందుకున్నారు. చంటి చిత్రం దాదాపు 40 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుకంది. రజతోత్సవం కూడా చూసిన ఈ సినిమా 1992 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది.
తాజావార్తలు
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
-
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..