Site icon NTV Telugu

వెంకీ మామతో ‘జాతిరత్నాలు’ దర్శకుడు

Venkatesh to team up with anudeep

‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. కామెడీతో కబడ్డీ ఆడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుదీప్ ని ఆ సినిమా సక్సెస్ తర్వాత పలు ఆఫర్స్ పలకరించాయి. అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ.

Read Also : కీర్తి సురేష్, త్రిషలతో సామ్ వీకెండ్ పార్టీ… పిక్స్ వైరల్

వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఇక ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వే. అనుదీప్ ఈ సారి కూడా కామెడీనే నమ్ముకుంటున్నాడట. తన కథకి వెంకటేశ్ న్యాయం చేయగలడని భావించి ఆయకు కథ వినిపించాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పని లో ఉన్నాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితే వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుని వెంటనే అధికారికంగా ప్రకటిస్తారట.

Exit mobile version