Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకీ మామకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. వెంకీ మామకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు. అందరి హీరోలు వెంకీ మామ ఫ్యాన్సే. ప్రస్తుతం వెంకీ 75 వ సినిమాగా సైంధవ్ తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. “మీ అందరి సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ అందరి ప్రేమ అభిమానాలు ప్రోత్సాహం కావాలి. 75వ చిత్రంగా సైంధవ్ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను. దర్శకుడు, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ మా టీం అంత అద్భుతంగా వర్క్ చేశారు. మా నిర్మాతలు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. సైంధవ్ మంచి ఎమోషన్ తో న్యూ ఏజ్ యాక్షన్ తో ఫాస్ట్ పేస్డ్ ఫిలిం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. 15 నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. సైంధవ్ ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సైంధవ్ నా కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి రియల్ ట్రీట్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. మరి సైంధవ్ తో వెంకీ మామ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
