Site icon NTV Telugu

Venkatesh: కొన్ని కారణాల వలన బ్రేక్ వచ్చింది..

Venky

Venky

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ ” ఏంటమ్మ ఇది ఈ వెంకీ మామకు ఎప్పుడు లాస్ట్ నా ఇస్తారు.. నాకు మాటలు రావు.. 30 ఏళ్లుగా ఇదే చెప్తున్నాను. నిజంగా ఎందుకు సంతోషంగా ఉంది అంటే ఎప్పుడో మూడేళ్ళ క్రితం నా సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి.. దాని తరువాత పరిస్థితి వలన ఓటిటీ లో దృశ్యం కానీ, నారప్ప కానీ అలా వెళ్లిపోయింది. మళ్లీ మే 27 న నా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది నాకు పెద్ద అవకాశం.. నా ఫ్యన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా. నా పాత సినిమాలతో మిమ్మల్ని నిరాశపరిచాను.. కానీ ఎఫ్ 3 మిమ్మల్ని నిరాశపర్చదు.

నా మీద ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతోంది. ఈ సినిమా మీకోసమే.. మీరందరు కుటుంబాలతో కలిసి వచ్చి థియేటర్లో సినిమాను చూడండి. అనిల్ మంచి కథతో వచ్చాడు. ఎఫ్ 2 ను మీరందరు సక్సెస్ చేశారు.. ఎఫ్ 3 కూడా మీరు సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కూడా అయి చిత్రబృందానికి థాంక్స్ చెప్పాలి. పేరు పేరునా అందరికి థాంక్స్ చెప్పాలి. అన్నపూర్ణమ్మ గారు, వై విజయమ్మ గారు నాకు ఎప్పుడు ఫుడ్ తెస్తూ ఉండేవారు.. వారికి థాంక్స్ చెప్పాలి అనుకున్నాను. వరుణ్ చాలా బాగా చేసాడు. తప్పకుండ ఈ సినిమా ప్రేక్షకులు మే 27 వెళ్ళాలి.. చూడాలి” అని చెప్పుకొచ్చారు.

https://www.youtube.com/watch?v=ie-1QQ3Tt24

Exit mobile version