NTV Telugu Site icon

Venkatesh: దుమ్ములేపుతున్న వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా  సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన ఈ  ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.  వెంకటేష్ కామెడీ స్టైల్, మేనరిజం మరోసారి తెరపై చూపించారు. హీరోయిన్  ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి అనిల్ రావిపూడి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా మొదటి రోజే రూ. 45 కోట్లకు పైగా భారీ వసూళ్లు రాబట్టగ, ఇప్పుడు  ఊహించని స్టైల్ లో  రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. 

అల వెంకటేష్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమగా ఈ మూవీ నిలిచింది. ఇక సంక్రాంతి సెలవులు ముగించుకుని వచ్చిన జనాలు, ఈ వీక్ ఎండ్ కోసం అప్పుడే టికెట్ లు బుక్ చేసుకున్నారట. దీంతో  మరో మూడు రోజుల వరకు టికెట్ లు దొరకడం కష్టం అని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 

Show comments