చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రీమేక్ ల హావా నడుస్తోంది.. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు.. ఇక రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఆయన చేసిన రీమేక్ లు ఇంకెవ్వరు చేయలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఐటీవలే దృశ్యం 2 రీమేక్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్న వెంకీ మామ మరో హిట్ రీమేక్ మీద కన్నేసినట్లు సమాచారం.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడట వెంకటేష్. పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా.. రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయం సాధించింది. ఎప్పటినుంచో ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాకుండా ఈ చిత్రంలో వెంకీ – రానా కలిసి నటిస్తున్నారని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు కొట్టిపడేసినా ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా హక్కులు తీసుకున్నారని టాక్ వినిపించడంతో మళ్లీ ఈ చిత్రంపై రూమర్స్ గుప్పుమన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది..? ఒకవేళ ఇది కనుక నిజమైతే దర్శకుడు ఎవరు..? అనేది తెలియాల్సి ఉంది.
