Venkatesh has agreed to Script Rejected by Chiranjeevi: ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు తోనూ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా దూసుకు పోతున్న అనిల్ చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఏ సినిమా చేయబోతున్నాడు? అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉండగా ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేసి తీసుకెళ్లి ఆయనకు వినిపించారని, లైన్ గా విన్నప్పుడు బాగానే ఉంది కానీ దాన్ని డెవలప్ చేసినప్పుడు ఎందుకో తనకి సూట్ కావడం లేదని మెగాస్టార్ చిరంజీవి ఆ కథను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Leader 2: రానా-శేఖర్ కమ్ముల లీడర్ 2 రెడీ?
దీంతో ఇప్పుడు అదే స్క్రిప్ట్ తీసుకుని ఆయన విక్టరీ వెంకటేష్ దగ్గరికి వెళ్లి కథ వినిపించగా అది విక్టరీ వెంకటేష్ కి నచ్చిందని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2 ఎఫ్3 సినిమాలొచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది 2025 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దిల్ రాజు. అయితే సంక్రాంతికి ఇప్పటికే శతమానం భవతి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో రెండిటినీ బరిలో దింపుతారా? లేక ఒకదాన్ని ఆపి తరువాత వదులుతారా? అనేది చూడాలి.