Venkatesh : సీనియర్ హీరో వెంకటేశ్, రానా మరోసారి వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ‘రానా నాయుడు’ సీజన్ 2తో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇందులోని తన పాత్రపై హీరో వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ సిరీస్ లో నేను నాగనాయుడు పాత్రలో నటించా. వాడు చాలా డిఫరెంట్. నాగనాయుడిని అంచనా వేయడం చాలా కష్టం. ఊహకు కూడా అందని విధంగా అతని ఆలోచనలు ఉంటాయి. వాడు రూల్స్ అస్సలు పాటించడు. ఎలా పడితే అలా వెళ్లిపోతుంటాడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు.
Read Also : Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..
రియల్ లైఫ్ లో నేను రూల్స్ పాటిస్తా. కానీ వాడు అలా కాదు. వాడికి డ్రామా అంటే ఇష్టం. లైఫ్ లో ఎలాంటి డ్రామాలు అయినా వేసేసి తనకు కావాల్సింది తెచ్చుకుంటాడు. నాగనాయుడికి తన కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం కోసం ఏమైనా చేస్తాడు. నేను కూడా రియల్ లైఫ్ లో అంతే. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ విషయంలో మేం ఇద్దరం ఒకటే. నాగనాయుడు పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు’ అంటూ వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.
Read Also : HHVM : ‘వీరమల్లు’ టికెట్ల రేట్ల పెంపు.. ఫిల్మ్ ఛాంబర్ కు ఏఎం రత్నం..
