మరికొద్ది రోజుల్లో ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమైన “దృశ్యం 2” సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఈ సినిమా తర్వాత హీరో వెంకటేష్ “ఎఫ్3″లో కనిపించనున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మొదట సంక్రాంతి పండుగకు విడుదల కానుందని ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ కూడా సంక్రాంతికి విడుదల కానుండడంతో ‘ఎఫ్ 3’ ఇంత తీవ్రమైన పోటీ మధ్య థియేటర్లలోకి వస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి.
Read Also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
“దృశ్యం 2” ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్ ఈ సినిమా విడుదల గురించి స్పందించారు. వెంకీ ‘ఎఫ్ 3’ సంక్రాంతికి విడుదల కాబోదని క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఎఫ్ 3’ వేసవిలో విడుదలవుతుందని, ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని వెంకీ మామ చెప్పాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “ఎఫ్3” చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు.
