HHVM : హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. పవన్ కల్యాణ్ నటించిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ అయిన తర్వాత జ్యోతికృష్ణ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన వీరమల్లు పాత్ర గురించి స్పందించాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను వేదాలను, పురాణాలను బేస్ చేసుకుని డిజైన్ చేశాం. మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వేదాలు చదువుకున్న వీరమల్లు ఒక వేద పండితుడిగా మారి వాటిని నాశనం చేయకుండా అడ్డుకుంటాడు. వీరమల్లు చిన్నప్పటి నుంచి గుడిలో పెరిగాడు. అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు’ అన్నారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..
వేద జ్ఞానంతో పంచ భూతాలను అవగతం చేసుకుని అన్యాయానికి ఎదురుగా వెళ్తాడు. వీరమల్లు పోరాడే ప్రతి సీన్ లో ధర్మం కనిపించేలా ఆ పాత్రను డిజైన్ చేశాం. ప్రకృతి ఆయనకు సహరించేలా ఇందులో చాలా సీన్లు ఉంటాయి. కొండపై గుల్ఫమ్ ఖాన్ ను కాపాడుతాడు. అలాగే యాగానికి ఏమీ కాకుండా రక్షించి వరుణ దేవుడు కరుణించేలా చేసి వర్షం కురిసేలా చేస్తాడు. తోడేళ్లను తన వేదాల జ్ఞానంతో తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఇవన్నీ వీరమల్లుకి వేద తత్వాల నుంచి వచ్చిన ప్రేరణ అంటూ చెప్పుకొచ్చాడు జ్యోతికృష్ణ. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర అనేది కేవలం కోహినూర్ వజ్రం దొంగిలించడం కోసమే కాకుండా.. ఒక ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా చూపించడం కోసమే ఇలా మార్చామని చెప్పారు జ్యోతికృష్ణ.
Read Also : Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?
