Site icon NTV Telugu

Veera Simha Reddy: జై బాలయ్య డైలాగ్ కి ఊగిపోతున్న సోషల్ మీడియా

Veera Simha Reddy

Veera Simha Reddy

వీర సింహా రెడ్డి ట్రైలర్ విడుదల కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలయ్యని వింటేజ్ ఫ్యాక్షన్ గెటప్ లో చూపిస్తూ గోపీచంద్ మలినేని, స్టన్ గన్ లో మాస్ స్టఫ్ ని లోడ్ చేసి దాన్ని ట్రైలర్ రూపంలో ఆడియన్స్ పైకి ఫైర్ చేశాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని టాలీవుడ్ హిస్టరీ ఓపెన్ చేస్తే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఆ హిస్టరీకి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా, ఫ్యాక్షన్ ని కాస్త మోడరన్ టచ్ ఇచ్చి వీర సింహా రెడ్డి సినిమాని రూపొందించాడు గోపీచంద్ మలినేని. అందుకే ట్రైలర్ ని చూడగానే బాలయ్య ఫాన్స్ అంతా స్కై హై లోకి వెళ్లిపోయారు. ఒక్క ట్రైలర్ కే పది రెడ్ బుల్స్ తగినంత ఎనర్జీని బాలయ్య ఫాన్స్ లో నింపిన చిత్ర యూనిట్, వీర సింహా రెడ్డి సినిమా పక్కా హిట్ అనే నమ్మకం అందరిలోనూ కలిగించింది.

వీర సింహా రెడ్డి ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి నందమూరి అభిమానులు రిపీట్ మోడ్ లో ట్రైలర్ ని చూస్తున్నారు. దీంతో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అతి కొద్దిసేపటిలోనే యుట్యూబ్ షేక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాలయ్య నామస్మరణ కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఒక చోట… “పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికి అయినా వెళ్లి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అదీ నేను” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ని ఎవరూ ఊహించి ఉండరు. ఆ మాస్ డైలాగ్ నందమూరి అభిమానులకే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా కిక్ ఇచ్చింది. ఈ సీన్ చూసిన వాళ్లు తెలియకుండా జై బాలయ్య అనేస్తున్నారు. జై బాలయ్య అనేది జస్ట్ ఒక స్లోగన్ మాత్రమే కాదు అది సెలబ్రేషన్ అంటూ మీమర్స్ కూడా మీమ్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. నిజంగానే వీర సింహా రెడ్డి ట్రైలర్ అంతా ఒకెత్తు, ఆ పబ్ డైలాగ్ ఒకెత్తు. స్వీట్ సర్ప్రైజ్ లా ఉన్న ఆ డైలాగ్ మరి కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసిన కనిపించడం, వినిపించడం గ్యారెంటీ.

Exit mobile version