Site icon NTV Telugu

Veera Simha Reddy: రేపే వీరసింహుని విజయోత్సవం

Veera Simha Reddy

Veera Simha Reddy

నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి సినిమాని నందమూరి అభిమానులకి స్పెషల్ గా మార్చాయి. పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్ గా నిలిచిన వీర సింహా రెడ్డి సినిమా బాలయ్యకి బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతి థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది.

అఖండ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని వీర సింహా రెడ్డి సినిమా 8 రోజుల్లోనే లేపవతల వేసింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తున్న వీర సింహా రెడ్డి సినిమా సక్సస్ మీట్ ని ప్లాన్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జనవరి 22న వీరసింహుని విజయోత్సవ సభ ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. రేపు సాయంత్రం అయిదు గంటలకి స్టార్ట్ అవనున్న ఈ విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణతో సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొనబోతున్నారు. మరి హిట్ కొట్టిన జోష్ లో బాలయ్య తన అభిమానులతో కలిసి చేసే రచ్చ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

Exit mobile version