నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చెయ్యగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేశారు. మరో 10 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్, ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. దాదపు 1:45 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ మేకింగ్ వీడియో పవర్ ఫుల్ గా ఉంది. బాలయ్య, మోక్షజ్ఞ, శృతి హాసన్, నారా బ్రహ్మిణి, నందమూరి తేజస్విని ఉన్న ఈ వీడియోలో బాలయ్య మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ఉన్నాడు. గోపీచంద్ మలినేని, బాలయ్యని వింటేజ్ బాలకృష్ణని గుర్తు చేసేలా డీల్ చేసినట్లు ఉన్నాడు. ఓల్డ్ లుక్ లో బాలయ్య స్టైల్ అండ్ స్వాగ్ సూపర్బ్ గా ఉన్నాయి, ముఖ్యంగా ఒక చోట బాలయ్య పంచకట్టిన స్టైల్ థియేటర్స్ విజిల్స్ తో మోతమొగిపోయేలా చేసే రేంజులో ఉంది.
వీర సింహా రెడ్డి మేకింగ్ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది, బాలయ్య స్మోకింగ్ స్టైల్ కూడా. ఒక ఫ్రేమ్ లో బాలయ్య స్మోకింగ్ స్టైల్ ని గోపీచంద్ మలినేని చూపించాడు. ఆ ఫ్రేమ్ లో బాలయ్య గంభీరంగా ఉన్నాడు. ఓవరాల్ గా ఈ మేకింగ్ వీడియో అండ్ ఇటివలే రిలీజ్ చేసిన పోస్టర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే… ఈ సినిమా బాలయ్య సూపర్ హిట్ మూవీ అయిన ‘సమర సింహా రెడ్డి’ని గుర్తు చేస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోలో మెయిన్ గా బాలయ్య వైట్ అండ్ వైట్ లుక్, ఆయన హెయిర్ స్టైల్ చూస్తుంటే ‘సమరసింహా రెడ్డి’ సినిమాలోని బాలక్రిష గుర్తొస్తున్నాడు. అందులో గొడ్డలి పట్టుకున్నాడు, ఈ కొత్త మూవీలో కత్తులు, సుత్తి… ఇలా చాలానే పట్టుకున్నాడు బాలయ్య. మరి ఆ ఐకానిక్ సినిమా హిట్ అయినట్లే వీర సింహా రెడ్డి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.