Site icon NTV Telugu

Unstoppable: వీర సింహా రెడ్డి చిత్ర యూనిట్ తో స్పెషల్ ఎపిసోడ్…

Unstoppable

Unstoppable

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ట్రైలర్ తో సాలిడ్ బజ్ ని క్రియేట్ చేశారు. యుట్యూబ్ ని షేక్ చేస్తున్న వీర సింహా రెడ్డి ట్రైలర్ ఊపు తగ్గే లోపు, ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం రిలీజ్ కానున్న ఈ మాస్ సాంగ్ తో వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో మరింత జోష్ రానుంది. ఈమధ్య కాలంలో ఏ సినిమా క్రియేట్ చెయ్యని పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయిన చిత్ర యూనిట్ సంక్రాంతికి ఒక గిఫ్ట్ ఇవ్వనున్నారు. బాలయ్య ‘ఆహా’లో చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ తాజా ఎపిసోడ్ లో వీర సింహా రెడ్డి చిత్ర యూనిట్ సందడి చెయ్యబోతున్నారు. సంక్రాంతికి టెలికాస్ట్ కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి ‘ఆహా’ అఫీషియల్ గా అన్నౌస్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

Read Also: Shakuntalam Trailer: అవమానాన్ని ఏ ప్రేమ మరిపించలేదు…

“ఈసారి పండుగకి బాలయ్య తరపునుంచి ఒక మాస్ కానుక. గాడ్ ఆఫ్ మాసెస్ విత్ ది టీం ఆఫ్ ది మాసివ్ వీర సింహా రెడ్డి. అన్ స్టాపబుల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ విత్ NBK, కమింగ్ సూన్” అంటూ ఆహా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది? ఇందులో ఎవరెవరు కనిపిస్తారు? అనే విషయాలపై ఆహా నుంచి క్లారిటీ లేదు. నందమూరి అభిమానులు మాత్రం ఈ పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో ‘హానీ రోజ్’ కూడా ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మా బావ మనోభావాలు అనే సాంగ్ లో బాలయ్యతో కలిసి హనీ రోజ్ మాస్ డాన్స్ చేసింది. ఈ సాంగ్ బయటకి వచ్చినప్పటి నుంచి మలయాళ హీరోయిన్ హనీ రోజ్ కి తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది.

Exit mobile version