Ram Charan Birthday Celebrations ఆదివారం ఘనంగా జరిగాయి. శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఇక అభిమానులు సైతం భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీతో చిన్నప్పుడు తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని, కానీ ‘చిరుత’ సినిమాతో ఆయనలో మంచి మెచ్యూరిటీ వచ్చిందని అన్నారు. ఇక స్క్రీన్ పై చరణ్ ను చూస్తున్నట్టు అన్పించలేదని, అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్టు అనిపిస్తోందని అంటూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచారు.
Read Also : Mega154 : యాక్షన్ లోకి దిగిన మెగాస్టార్
ఇక ఇదే వేదికగా వరుణ్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. “ఎవరన్నా చరణ్ అన్నను ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీరందరితో పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమనండి, ఆ తరువాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చు” అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆ వార్నింగ్ ఎవరికి అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
