NTV Telugu Site icon

Varun Tej 13: VT 13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.. డిసెంబర్‌లో రిలీజ్?

Varun Tej 13 Movie Schedule Completed

Varun Tej 13 Movie Schedule Completed

VT13 Action Schedule Completed: 2014లో ‘ముకుంద’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ తేజ్ ఇప్పుడు తన 13వ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాతో అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ తో ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరుణ్‌ తేజ్ 13వ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా సినిమా షూట్ కూడా శరవేగంగా జరుగుతోంది.

Bhaag saale: టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ.. ‘భాగ్ సాలే’ నిర్మాత అర్జున్ సంచలన వ్యాఖ్యలు

నిజానికి #VT13 టీమ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 యాకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోంది. ఇక అలా జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా మేకర్స్ రివీల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న IAF అధికారిగా కనిపిస్తున్నారు. భారీ అంచనాలున్న వరుణ్‌ తేజ్ 13వ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో శరవేగంతో జరుగుతోంది. ఇక అక్కడే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ స్థాయిలో షూట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ డాషింగ్ గా కనిపిస్తున్న కొన్ని స్టిల్స్ ను సైతం తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Show comments