NTV Telugu Site icon

Matka: చివరి రౌండ్ లో వరుణ్ తేజ్ ‘మట్కా’

Matka

Matka

Varun Tej Pan India Movie Matka Final Schedule Underway In RFC: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు.

Devara: యో.. చూసుకోబళ్ళా.. జాగ్రత్త సామీ!!

ఇటివలే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్నాయి. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా చాలా ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రాబోతున్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments