Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టేకలకు పెళ్లితో ఒక్కటవ్వనున్నారు. మరి కొద్దిసేపటిలో వరుణ్ .. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఇక ఈ సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం పాల్గొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సైతం వీరి పెళ్ళికి హాజరయ్యాడు. అప్పుడెప్పుడో వెళ్లినరోజు ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు అంతే.. ఇప్పటివరకు ఏ పెళ్లి వేడుకలో కూడా పవన్ కనిపించింది లేదు. కాక్ టైల్ పార్టీ, హల్దీ, మెహందీ, సంగీత్.. లాంటి ఏ వేడుకలో కూడా పవన్ కనిపించింది లేదు. దీంతో అభిమానులందరూ పవన్ ఎక్కడ.. పవన్ ఎక్కడ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా పవన్ కనిపించకపోయేసరికి మీమ్స్ వేసి మరీ ట్రెండ్ చేస్తున్నారు.
Rashmika Mandanna: మరీ ఇంత క్యూట్ గా నవ్వితే ఎలా పాప.. కుర్రాళ్లు ఏమైపోవాలి..
ఎక్కడ ఉన్నాడో పట్టుకొని కొన్ని ఫోటోలు దింపండయ్యా.. అని కొందరు. కొడుకు పెళ్లి అని చెప్పండ్రా.. రూమ్ లోనే కూర్చున్నాడేమో అని ఇంకొందరు.. పవన్ కళ్యాణ్ పిక్ ఉంటే పెట్టండి బ్రో అంటూ వేడుకుంటున్నారు. కొంతమంది అభిమానులు అయితే కొన్ని మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం పవన్ ఒకపక్క రాజకీయాలతో ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.