NTV Telugu Site icon

Lavanya-Varun: వీరిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారు?

Lawanya Varuntej

Lawanya Varuntej

Lavanya-Varun: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించిన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నిశ్చితార్థం నిన్న (శుక్రవారం) కొందరు బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. వీరిద్దరు ఎక్కడ, ఎప్పుడు కలిశారన్నది ఆసక్తికరం. శ్రీనువైట్ల దర్శకత్వంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘మిస్టర్‌’. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత, మెగా కాంపౌండ్‌లోని మూలాల ప్రకారం, వారిద్దరూ తమ ఆలోచనలను ఒక సాధారణ స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో వెల్లడించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ తమ ప్రేమను పెద్దలకు చెప్పారు. వాళ్లు ఓకే చెప్పడంతో త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అంతరిక్షం’. ఈ రెండు డిజాస్టర్ సినిమాలు వీరి ప్రేమను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయని చెప్పాలి.

Read also: Top Headlines@9AM: టాప్ న్యూస్

యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని, ఆమె పెళ్లి కూడా చేసుకోబోతోందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మెగా వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఎట్టకేలకు ఈ ఇద్దరూ ఒక్కటి కానున్నారు. రాజస్థాన్‌లోని ఓ పెద్ద ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అక్కడే పెళ్లి చేసుకోవాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు సానుకూలంగా ఉన్నారని, అందరూ కూర్చుని మాట్లాడుకుని ఈ ఏడాది చివర్లో కార్తీక మాసంలో పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ‘హ్యాండ్‌సప్‌’ చిత్రంలో చిరంజీవి బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముకుంద’తో హీరోగా వెండితెరపై అరంగేట్రం చేశాడు.

ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ సినిమాలో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆ తర్వాత లోఫర్, మిస్టర్ సినిమాలు పెద్దగా ఆడలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ‘అంతరిక్షం 9000 KMPH’ మంచి ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. సినీ కెరీర్‌లో హీరోగానే కాకుండా నిహారిక నిర్మించిన ‘నాన్న కూచి’ వెబ్ సిరీస్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అతను కామిక్స్ చిత్రం అల్లాదీన్‌కి కూడా తన గాత్రాన్ని అందించాడు. 2019లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్ తో ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో తనదైన నటనతో మెప్పించాడు. గతేడాది వచ్చిన ‘గని’ సినిమాతో ఆకట్టుకోకపోయినా ఎఫ్3 సినిమాలో కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. త్వరలో ‘గాండివాడరి అర్జున’ సినిమాతో పలకరించనున్నాడు.
Chennai: సినిమా సీన్ కాదు అంతకుమింది.. రన్నింగ్ బస్సు ఎక్కి దొంగతనం