Site icon NTV Telugu

Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్

Varun Tej Lavanya Tripathi Baby (2)

Varun Tej Lavanya Tripathi Baby (2)

మెగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. దీంతో మొత్తం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి పోయింది. మొత్తానికి వరుణ్–లావణ్య జంట తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త బయటకు వచ్చిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Deepika Padukone : కూతురి కోసం కేక్ చేసిన దీపికా పదుకొనే – దువా ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్

ఇక వరుణ్–లావణ్య ప్రేమ కథ బాలీవుడ్ స్టైల్‌లో సాగింది. దాదాపు ఎనిమిదేళ్ల ప్రేమ తరువాత 2023లో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఏడాది మే 6న ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్య తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ బేబీ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పండంటి బాబు పుట్టడంతో ఆ ఆనందం రెట్టింపైంది. లావణ్య, వరుణ్ దంపతులు తల్లిదండ్రుల అయ్యారని తెలిసి సినీ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Exit mobile version