Site icon NTV Telugu

Varun Tej: నా ఫేవరెట్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నా.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Varun Tej Lavanya Thripati Marriage News

Varun Tej Lavanya Thripati Marriage News

Varun Tej Intresting Comments on his wife Lavanya Thripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరంకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీ అందించారు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ ఆకట్టుకునేలా పాడారు. ఆకర్షణీయమైన విజువల్స్ ఉన్న పాటతో సంగీత ప్రియులు వెంటనే ప్రేమలో పడేలా ఉన్నాయి. ఇక సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఆనందంగా ఉంది, పాట కంటే సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు.

Eagle: మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చింది…

మనందరికీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరిని ఒకరు జాగ్రత్తగా చూసుకుంటాం కానీ దేశాన్ని కాపాడే సైనికులు 130 కోట్ల మందిని తన కుటుంబంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సైనికుల కోసం, వాళ్ళు చేసిన త్యాగాల కోసం, వాళ్ళ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గొప్ప ఉద్దేశంతో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేశాం, థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలవుతారని అన్నారు. ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుందని గర్వంగా చెబుతున్నాను అన్నారు. ఇక అదే సమయంలో ఆయన కాలేజీ పిల్లలతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఒక స్టూడెంట్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే లావణ్య అని ఆమె ఇంట్లో ఉందని చెప్పుకొచ్చారు. ఆమె కాకుండా ఇంకా ఎవరు అని అడిగితే దానికి వరుణ్ సాయి పల్లవి అని సమాధానం ఇచ్చారు.

Exit mobile version