Site icon NTV Telugu

Varun Tej: పలాస డైరెక్టర్ తో మెగా ప్రిన్స్ ‘మట్కా’…

Varun Tej

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో స్పై థ్రిల్లర్ ‘ఘాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని సైమల్టేనియస్ గా రన్ చేస్తున్న వరుణ్ తేజ్, తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసాడు. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు కరుణ కుమార్.

Read Also: Tamannaah Bhatia Pics: తమన్నా భాటియా హాట్ ట్రీట్.. ఇలా చూపిస్తే అంతే సంగతులు!

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో కూడా పర్వాలేదనిపించిన కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్నాడు. ‘మట్కా’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో వింటేజ్ కార్, వన్ రూపీ కాయిన్ ని చూస్తుంటే కరుణ కుమార్ మరోసారి కొత్తరకం కథతో రాబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మోహన్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మధ్య తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మట్కా సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.

Exit mobile version