NTV Telugu Site icon

Nindha: ‘నింద’ పడితే తుడిచేదెలా? ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ సినిమా ట్రైలర్

Nindha Trailer

Nindha Trailer

Varun Sandesh’s Nindha Trailer: హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తరువాత ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సమాజాన్ని ఆలోచించేలా ఉంది.

Co- Director Suicide: షాకింగ్: సూసైడ్ చేసుకున్న కో-డైరెక్టర్.. అసలు ఏమైందంటే?

‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో.. ‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’.. ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు’.. ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేదు’.. అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక అమ్మాయి హత్యాచారం చుట్టూ కథ తిరుగుతుండటంతో అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ భరితంగా ఉండేలా కనిపిస్తోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

Show comments