Varun Sandesh : యంగ్ హీరో వరుణ్ సందేశ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త మూవీ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఏ పళని స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..
డైరక్టర్ త్రినాధరావు నక్కిన ఫస్ట్ సీన్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టీ ఎస్ రావు మరో అతిథిగా వచ్చారు. అనంతరం త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ మూవీ మంచి హిట్ కావాలని కోరుకున్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..‘వన్ వే టికెట్’ టైటిల్ విన్న వెంటనే తనకు కొత్తగా అనిపించిందని.. అందుకే మూవీకి వెంటనే ఓకే చేసినట్టు తెలిపాడు. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపాడు వరుణ్ సందేశ్. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ మీద మూవీని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.
Read Also : Shekhar Kammula : కృష్ణవంశీ నన్ను రిజెక్ట్ చేశాడు.. శేఖర్ కమ్ముల సీక్రెట్ రివీల్..
