Varun Dhawan Bhediya Film Releasing As Thodelu In Telugu: ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా ‘బేడియా’ ట్రైలర్ వచ్చేసింది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా ‘బేడియా’ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. ఈ సినిమా తెలుగు లో ‘తోడేలు’ పేరు తో రాబోతుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లవుతున్న సందర్భంగా ‘తోడేలు’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 25న రిలీజ్ అవ్వనుంది.
అరుణాచల్ అడవుల నేపథ్యంగా ‘బేడియా’ కథ సాగుతుంది. ఇక్కడి వైల్డ్ యానిమల్ గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు ”టాప్ గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్” వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు గ్రాఫిక్స్ డిజైన్ చేశాయి.
ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత దినేష్ విజాన్ మాట్లాడుతూ… ”ఈ కథను ఫైనల్ చేసినప్పుడే ఇంత భారీ స్కేల్ లో నిర్మించాలని నిర్ణయించాం. దేశ విదేశాల్లో పేరున్న వీఎఫ్ఎక్స్ కంపెనీలు మా చిత్రానికి పనిచేశాయి. ఆ విజువల్ క్వాలిటీని ట్రైలర్ లో చూడొచ్చు. సకుటుంబ ప్రేక్షకులు థియేటర్ లో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అన్నారు. దర్శకుడు అమర్ కౌశిక్ మాట్లాడుతూ, ”ట్రైలర్ లో చూపించిన సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కొన్నే. థియేటర్ లో ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.కథా కథనాలు సర్ ప్రైజ్ చేస్తాయి. భయపెడుతూనే నవ్విస్తుంటాయి” అని చెప్పారు.
