Site icon NTV Telugu

Bawaal: జాన్వీ కపూర్ తో వరుణ్ ధావన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్!

Bawaal

గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, 2023 ఏప్రిల్ 7న మూవీని విడుదల చేస్తామని అన్నారు. ఈ విషయమై వరుణ్ ధావన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ‘సాజిద్ నడియాద్ వాలా నిర్మాతగా, నితిష్ తివారి దర్శకత్వంలో జాన్వీ కపూర్ తో మూవీ చేయడం ఎగ్జయిటింగ్ గా ఉందని తెలిపాడు. మరి ఈ సినీ వారసుల మధ్య కెమిస్ట్రీ ఏ లెవల్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Also : Manchu Manoj : షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు… జరిమానా

Exit mobile version