Site icon NTV Telugu

“వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్

Varudu Kaavalenu on 15th October

యంగ్ హీరో నాగశౌర్య దసరాను టార్గెట్ చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా విడుదల తేదికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Read Also : ‘మా’ ఎలక్షన్స్ లో మా నాన్నే నాకు వ్యతిరేకం : మంచు విష్ణు

ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. రీసెంట్ గా విడుదలైన ‘వరుడు కావలెను’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Exit mobile version