Site icon NTV Telugu

Krishna Vrinda Vihari : “వెన్నెల్లో వర్షంలా”… రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన సామ్

Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం Krishna Vrinda Vihari అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అందులో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య ఉన్న ఆకర్షణీయమైన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యూత్‌ఫుల్ మూవీలో నుంచి “వెన్నెల్లో వర్షంలా…” అనే ఫస్ట్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసింది. బ్యూటిఫుల్ పీపుల్ తో బ్యూటిఫుల్ సాంగ్ అంటూ సామ్ ఈ సాంగ్ ను విడుదల చేసి, చిత్రబృందాన్ని విష్ చేసింది.

Read Also : Godfather : పూరీ మొదటి కలను నెరవేరుస్తున్న మెగాస్టార్

“వెన్నెల్లో వర్షంలా…” సాంగ్ ను ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే కలిసి పాడగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీమణి తన సాహిత్యంతో శౌర్య, షైర్లీల మధ్య ఉన్న ఆనందకరమైన బంధాన్ని కళ్ళకు కట్టారు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్, ఎఎడిటింగ్ ని తమ్మిరాజు చూసుకుంటున్నారు. ఇక ఈ విభిన్నమైన రోమ్-కామ్‌ను ఉషా ముల్పూరి నిర్మించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. Krishna Vrinda Vihari ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1512666384006017030

Exit mobile version