Site icon NTV Telugu

Vaarasudu: అల్ట్రా స్టైలిష్ సంక్రాంతి బుల్లోడు..

Vaarasudu

Vaarasudu

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు(వారసుడు)’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక నేడు దళపతి పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్న సాయంత్రం ఈ సినిమ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ ను రిలీజ్ చేసి విజయ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇక పోస్టర్ లో విజయ్ సంక్రాంతి బుల్లోడును గుర్తుచేశాడు. చూడడానికి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించినా చుట్టూ సంక్రాంతిని గుర్తు చేశాడు. చిన్న పిల్లలు, చెరుకు గడలు, గాలిపటాలు మధ్య విజయ్ నవ్వుతూ పడుకున్న లుక్ ఆకట్టుకొంటుంది. ఇక విజయ్ పక్కన బ్యాగ్ ఉండడం బట్టి ఆటను ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి పోస్టర్ లో చూస్తే సూట్ లో సీరియస్ గా కనిపించిన విజయ్ సెకండ్ పోస్టర్ లో క్యాజువల్ గా నవ్వుతు కనిపించాడు. దీనిబట్టి ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదిఏమైనా ఈ పోస్టర్ మాత్రం విజయ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక నేటి సాయంత్రం మరో పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఆ పోస్టర్ ఎలా ఉండనుందో చూడాలి.

Exit mobile version