Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Varalxmi Sarathkumar Interview For Hanuman Movie

Varalaxmi: నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు.. కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇంటర్వ్యూ

Published Date :January 10, 2024 , 6:47 pm
By Bhargav Chaganti
Varalaxmi: నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు..  కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Varalaxmi Sarathkumar Interview for Hanuman Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతున్న నేపధ్యంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ హను-మాన్ కథ, మీ పాత్ర గురించి చెప్పినప్పుడు ఎలా అనిపించింది ? ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
-ప్రశాంత్ వర్మ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. తప్పకుండా చేయాలని ఫీలింగ్ కలిగింది. ఇందులో తేజకి అక్క పాత్రలో కనిపిస్తా. బ్రదర్, సిస్టర్ మధ్య వుండే సరదా సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. చాలా క్యూట్ గా ఉండి ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్, ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశా, అది ట్రైలర్ లో చూసే ఉంటారు. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈ చిత్రం ఇంత పెద్ద స్కేల్ లో గ్రాండ్ గా రావడం చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది. తేజ, ప్రశాంత్, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ చిత్రం అద్భుతంగా అలరిస్తుందని ఆశిస్తున్నా.

షూటింగ్ సమయంలో తేజ, దర్శకుడు ప్రశాంత్ కు మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారు?
-ప్రశాంత్ చాలా ఫోకస్ గా ఉంటారు, తనకేం కావాలో పూర్తి క్లారిటీ తనలో ఉంటుంది. తేజ, ప్రశాంత్ మధ్య మంచి సింక్ వుంది. పైగా ప్రశాంత్ ఒక్క టేక్ లో ఓకే చెప్పే డైరెక్టర్ కాదు, తను అనుకున్నది వచ్చే వరకు రాజీపడరు. అయితే ఏదైనా బెటర్ మెంట్ కి ఉపయోగపడుతుందంటే ఇన్ పుట్ తీసుకుంటారు.

మీరు పెద్ద స్టార్స్,పెద్ద బడ్జెట్ లో సినిమాలు చేశారు.. హనుమాన్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
-నిజానికి నాకు ఎలాంటి తేడా కనిపించలేదు. తొలి రోజు సెట్ లో అడుగు పెట్టినప్పుడు .. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ వున్నాయి. అప్పుడే సినిమా క్యాలిటీ అర్థమైయింది. ఇది పెద్ద బడ్జెట్ సినిమాలానే తీస్తున్నారనిపించింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నిర్మాత నిరంజన్ రెడ్డికి హ్యాట్సప్ చెప్పాలి. హను మాన్ ని చాలా అద్భుతంగా నిర్మించారు. దర్శకుడి విజన్ ని అర్థం చేసుకునే నిర్మాత నిరంజన్ .

వీర సింహారెడ్డి, క్రాక్, కోటబొమ్మాలి పీఎస్ చిత్రాల్లో మీరు చేసిన పాత్రలకు గ్రే షేడ్ ఉంటుంది. హనుమాన్ లో పాజిటివ్ పాత్రలా అనిపిస్తుంది. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?
-ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందని పేరు వచ్చింది. ఆ పేరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. హను-మాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది.

హీరోయిన్ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవడానికి కారణం ?
-నటనలో ఎప్పుడూ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. మొదటి నుంచి ఈ అలవాటు లేదు. వీర సింహారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. అది నాకు ముఖ్యం. కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది చూసుకుంటాను. కొంతమందికి నా పేరు తెలియదు. వాళ్ళు నన్ను జయమ్మ, భానుమతి అని పిలుస్తారు. అదే నాకు అసలైన అవార్డు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మీ వర్క్ ని అభినందించడం ఎలా అనిపించింది ?
చిరంజీవి నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డులా అనిపించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను.

డ్రీమ్ రోల్స్ ?
నేను ప్లాన్ చేయడం ఆపేశాను. నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు, జీవితంలో జరగాల్సింది జరిగిపోతుంది.

బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా ?
నేను ఎప్పుడూ భాష గురించి ఆలోచించలేదు. ఎక్కడ మంచి రోల్ దొరికితే అది చేస్తా, హిందీలో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ పాత్రలు అంత ఆసక్తికరంగా అనిపించ లేదు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సుదీప్ మ్యాక్స్ సినిమా చేస్తున్నాను. ధనుష్ D50 లో చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Varalaxmi Sarathkumar
  • Varalaxmi Sarathkumar interview
  • Varalxmi Sarathkumar Interview

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions