Varalaxmi: నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు.. కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar Interview for Hanuman Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతున్న నేపధ్యంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ హను-మాన్ కథ, మీ పాత్ర గురించి చెప్పినప్పుడు ఎలా అనిపించింది ? ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
-ప్రశాంత్ వర్మ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. తప్పకుండా చేయాలని ఫీలింగ్ కలిగింది. ఇందులో తేజకి అక్క పాత్రలో కనిపిస్తా. బ్రదర్, సిస్టర్ మధ్య వుండే సరదా సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. చాలా క్యూట్ గా ఉండి ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్, ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశా, అది ట్రైలర్ లో చూసే ఉంటారు. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈ చిత్రం ఇంత పెద్ద స్కేల్ లో గ్రాండ్ గా రావడం చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది. తేజ, ప్రశాంత్, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ చిత్రం అద్భుతంగా అలరిస్తుందని ఆశిస్తున్నా.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
షూటింగ్ సమయంలో తేజ, దర్శకుడు ప్రశాంత్ కు మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారు?
-ప్రశాంత్ చాలా ఫోకస్ గా ఉంటారు, తనకేం కావాలో పూర్తి క్లారిటీ తనలో ఉంటుంది. తేజ, ప్రశాంత్ మధ్య మంచి సింక్ వుంది. పైగా ప్రశాంత్ ఒక్క టేక్ లో ఓకే చెప్పే డైరెక్టర్ కాదు, తను అనుకున్నది వచ్చే వరకు రాజీపడరు. అయితే ఏదైనా బెటర్ మెంట్ కి ఉపయోగపడుతుందంటే ఇన్ పుట్ తీసుకుంటారు.
మీరు పెద్ద స్టార్స్,పెద్ద బడ్జెట్ లో సినిమాలు చేశారు.. హనుమాన్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
-నిజానికి నాకు ఎలాంటి తేడా కనిపించలేదు. తొలి రోజు సెట్ లో అడుగు పెట్టినప్పుడు .. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ వున్నాయి. అప్పుడే సినిమా క్యాలిటీ అర్థమైయింది. ఇది పెద్ద బడ్జెట్ సినిమాలానే తీస్తున్నారనిపించింది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నిర్మాత నిరంజన్ రెడ్డికి హ్యాట్సప్ చెప్పాలి. హను మాన్ ని చాలా అద్భుతంగా నిర్మించారు. దర్శకుడి విజన్ ని అర్థం చేసుకునే నిర్మాత నిరంజన్ .
వీర సింహారెడ్డి, క్రాక్, కోటబొమ్మాలి పీఎస్ చిత్రాల్లో మీరు చేసిన పాత్రలకు గ్రే షేడ్ ఉంటుంది. హనుమాన్ లో పాజిటివ్ పాత్రలా అనిపిస్తుంది. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?
-ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందని పేరు వచ్చింది. ఆ పేరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. హను-మాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది.
హీరోయిన్ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవడానికి కారణం ?
-నటనలో ఎప్పుడూ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. మొదటి నుంచి ఈ అలవాటు లేదు. వీర సింహారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. అది నాకు ముఖ్యం. కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది చూసుకుంటాను. కొంతమందికి నా పేరు తెలియదు. వాళ్ళు నన్ను జయమ్మ, భానుమతి అని పిలుస్తారు. అదే నాకు అసలైన అవార్డు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మీ వర్క్ ని అభినందించడం ఎలా అనిపించింది ?
చిరంజీవి నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డులా అనిపించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను.
డ్రీమ్ రోల్స్ ?
నేను ప్లాన్ చేయడం ఆపేశాను. నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు, జీవితంలో జరగాల్సింది జరిగిపోతుంది.
బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా ?
నేను ఎప్పుడూ భాష గురించి ఆలోచించలేదు. ఎక్కడ మంచి రోల్ దొరికితే అది చేస్తా, హిందీలో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ పాత్రలు అంత ఆసక్తికరంగా అనిపించ లేదు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సుదీప్ మ్యాక్స్ సినిమా చేస్తున్నాను. ధనుష్ D50 లో చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!