Site icon NTV Telugu

Varalakxmi Sarathkumar: కరోనా బారిన పడ్డ బాలయ్య హీరోయిన్..

Varalaxmi

Varalaxmi

Varalakxmi Sarathkumar: గత రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది అనుకొనేలోపు చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం భయాందోళనలను కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

“అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. నటీనటులు ప్లీజ్ మొత్తం సిబ్బందికి మాస్కింగ్ చేయాలని పట్టుబట్టడం ప్రారంభించండి. ఎందుకంటే మేము నటులుగా మాస్క్‌లు ధరించలేము. నన్ను కలిసిన వారు లేదా నాతో పరిచయం ఉన్నవారు దయచేసి చెక్ చేసుకోండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి.. కోవిడ్ ఇంకా ఇక్కడ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమెను చూస్తుంటే లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక వరలక్ష్మీ కెరీర్ విషయానికొస్తే.. ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క విలన్ గా మెప్పిస్తోంది. ప్రస్తుతం వరుస తెలుగు మూవీలు చేస్తున్న వరూ.. బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఎన్బీకే 107 లో నటిస్తోంది. ఇందులో బాలయ్యకు విలన్ గా వరలక్ష్మీ నటిస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో వరూ మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.

Varalakxmi sarathkumar Tweet:

Exit mobile version