Site icon NTV Telugu

World of Sabari: కన్నబిడ్డను కాపాడుకోడానికి ‘శబరి’ ఏం చేసింది!?

Sabari

Sabari

Varalakshmi Sarathkumar: విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ, పాత్రకు తగ్గట్టుగా స్టైల్, యాక్టింగ్ మారుస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ లేడీగా  పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల దీనిని నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా ఆయనే సమకూర్చారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘శబరి’ మూవీ రూపొందుతోంది. 

‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో మంగళవారం మేకర్స్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ‘శబరి’ థీమ్, మూడ్ ఎలా ఉంటుందనేది చూపించారు. ప్రకృతికి చిరుమానా లాంటి ఓ హిల్ స్టేషన్‌లో ఓ మహిళ తన చిన్నారి కుమార్తెతో జీవిస్తుంటుంది. ‘మమ్మీ…’ అనే అరుపుతో ఒక్కసారి మూడ్ మారింది. మృగం మీ ఇంటిలోకి అడుగు పెడితే… మీరు ప్రేమించే మనుషులను కాపాడటం కోసం ఎంత దూరం వెళతారు? అని వీడియోలో ఓ కోట్ వచ్చింది. విజువల్స్ చూస్తే… పాపను ఎవరో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కన్నబిడ్డను కాపాడుకోవడం కోసం శబరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎటువంటి పోరాటం చేశారనేది కథగా అర్థం అవుతోంది. 

బుల్లెట్ రైడ్ చేస్తున్న వరలక్ష్మిని వీడియోలో చూపించారు. ధైర్యం విషయంలో రాయల్ లేడీ వంటి మహిళ ‘శబరి’ అని చెప్పకనే చెప్పారు. విలన్ రోల్ ‘మైమ్’ గోపి చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. అంతే కాదు… వరలక్ష్మి, ‘మైమ్’ గోపి మధ్య ఫేస్ ఆఫ్ సీన్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ వీడియోలో మిగతా పాత్రలనూ చూపించారు. తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ విజువల్స్ బావున్నాయి.  ”స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆమె అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version