Site icon NTV Telugu

Varalakshmi Sarathkumar : ‘అర్జునుడి గీతోపదేశం’ చెబుతానంటున్న వరలక్ష్మీ

Varalakshmi Sarathkumar New Movie Arjunudi Geethopadesham Started: టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న సినిమాకి ‘అర్జునుడి గీతోపదేశం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమెరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, చైతన్య కందుల డీవోపీగా, అర్జున్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Yediyurappa: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. దర్యాప్తును సీఐడీకి అప్పగింత

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు సతీష్ గోగాడ మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా, ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్ గా స్పందించారు, మార్చి 20 నుంచి మొదటి షెడ్యూల్ అమలాపురంలో మొదలు పెడుతున్నాం అని అని అన్నారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై లో తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో ఇది మొదటి సినిమా, సతీష్ చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది, అన్నారు రాజీవ్ మాట్లాడుతూ దర్శకుడు సతీష్ కి సినిమా అంటే చాలా పాషన్ అని అన్నారు. కథ చెప్పినప్పుడు చాలా ప్లజెంట్ గా అనిపించింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నా, యంగ్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలన్నారు. దివిజ మాట్లాడుతూ చాలా మంచి కథ ఇది. ఇందులో లీడ్ రోల్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్, ఆదిత్య శశికుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version