NTV Telugu Site icon

Vanitha Vijayakumar: హీరోయిన్ గా వనిత కూతురు..ఎంత అందంగా ఉందో చూశారా?

Vanitha Vijaykumar Daughter Jovika Vijaykumar

Vanitha Vijaykumar Daughter Jovika Vijaykumar

Vanitha Vijayakumar Daughter to become heroine: సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. “దేవి” సినిమా ద్వారా తెలుగు వాళ్లకు ఆమె సుపరిచతమే. ఆ తరువాత కూడా ఆమె పలు తెలుగు, తమిళ సినిమాలో నటించింది. ముందుగా ఆమె టెలివిజన్ యాక్టర్ ఆకాష్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే వనిత విజయ్ కుమార్ కుమార్తె జోవిక ఇప్పుడు హీరోయిన్ గా లాంచ్ కానునట్టు తెలుస్తోంది. వనితా విజయకుమార్ ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని షేర్ చేశారు. ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకున్న వనిత కుమార్తె జోవిక, తమిళ సినీ ప్రపంచంలో కథానాయికగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.

Samantha: పాపం…. సమంతను తిట్టుకున్నారు కదరా… అనారోగ్యంలోనూ ఎంత కష్టపడుతుందో తెలుసా?

ఈ మేరకు తమిళ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వనితా విజయ్‌ కుమార్‌ కూడా తన కూతురు జోవిక కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని, ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి జోవిక ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు శిక్షణ తీసుకుందట. కానీ జోవికను హీరోయిన్‌గా నటింప చేయాలా? లేక ముఖ్యమైన పాత్రలో నటింప చేయాలా? అనేది ఇంకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో కాంబినేషన్స్ పక్కనపెట్టి కథ బాగుందా? లేదా? అన్నదానిపైనే ఫోకస్‌ చేస్తున్నామని తన కుమార్తె ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది’ అని వనిత చెబుతున్నారు. వనితా విజయ్‌ కుమార్‌ తెలుగులో చివరగా నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Show comments