NTV Telugu Site icon

Vanitha: నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్

Vanitha Marriage

Vanitha Marriage

Vanitha Vijaykumar getting Ready for fourth Marriage: వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయకుమార్ -రెండవ భార్య నటి మంజులల పెద్ద కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అలా 1995లో నటుడు విజయ్‌ సరసన వనితా విజయకుమార్‌ నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీని తర్వాత ‘మాణిక్యం’లో నటించిన వనితా విజయకుమార్ తెలుగులో దేవి, మలయాళంలో ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. చేసిన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత అంశాల వలన వార్తల్లో ఉండే వనిత విజయకుమార్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన కొద్ది నెలల్లోనే ఆనంద్ జయరాజన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. వనితకు రెండో భర్త ద్వారా జయనిత అనే కూతురు పుట్టింది. తర్వాత 2012లో ఆమె ఆనంద్ నుంచి విడాకులు కూడా తీసుకున్నారు.

Ram Charan: చరణ్ డాన్స్ కి సమంత ఫిదా.. ఎవరయ్యా ఇలా చేసేది?

ఆ తరువాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వనితా విజయకుమార్ మళ్లీ వెండితెరపైకి వచ్చేందుకు బిగ్ బాస్ కార్యక్రమం తోడ్పడింది. అక్కడే ఏర్పడిన పరిచయం పీటర్ పాల్‌తో స్నేహం దాకా వెళ్లి ప్రేమ పుట్టి 2020లో వివాహంలో ముగిసింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇంట్లో జరిగిన ఈ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయలేదు. పీటర్ పాల్ మద్యానికి బానిస అంటూ కేవలం మూడు నెలల్లోనే వనితా విజయకుమార్ విడిపోయారు. ఆ తరువాత, వనిత తన సినీ జీవితంపై దృష్టి సారించింది మరియు చాలా చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే ప్రశాంత్ నటించిన ‘అంధగన్’లో కూడా ఆమె నటనకు ప్రశంసలు అందాయి. వివాదాలకు పెట్టింది పేరైన వనితా విజయకుమార్ ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమైందా అనే సందేహం నెలకొంది. అదేంటంటే.. ‘ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్’ సినిమాలో నటిస్తూ.. ఆమెతో ప్రేమ వార్తల్లో చిక్కుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీ రాబర్ట్ మాస్టర్ కి ఆమె బీచ్ లో బికినీలో మోకరిల్లి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్ 5న కీలక సమాచారం వెలువడుతుందని అంటున్నారు. ఇది కేవలం సినిమా అప్డేట్ ఏనా? లేక నిజంగా నాలుగో పెళ్లా? అనేది ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show comments