Site icon NTV Telugu

Vamshi Paidipally: బాలీవుడ్ స్టార్ హీరోను పట్టేసిన పైడిపల్లి.. దిల్ రాజు నిర్మాణంలో సినిమా!

Vamshi Paidipally

Vamshi Paidipally

Vamshi Paidipally to Team up With Shahid Kapoor: దర్శకుడు వంశీ పైడిపల్లి పరుగులు తీస్తూ సినిమాలు తెరకెక్కించకుండా స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ పోతున్నారు. సినిమాలపై ఆసక్తితో 2002లో ప్రభాస్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ఈశ్వర్’కు దర్శకుడు జయంత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టాడు వంశీ. తరువాత దిల్ రాజు ‘భద్ర’ సినిమాకు పనిచేస్తూ, ఆయనను తన కథతో ఆకట్టుకోగా ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రంతో దర్శకునిగా పరిచయం చేశారు దిల్ రాజు. తరువాత జూ.యన్టీఆర్ హీరోగా ‘బృందావనం’, రామ్ చరణ్, బన్నీతో ‘ఎవడు’, నాగార్జున, కార్తీతో ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఇక మూడేళ్ళకు మహేశ్ బాబుతో ‘మహర్షి’ చేసి తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే సినిమాను చేసి తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ చేశారు.

Rashmika Mandanna : బ్లాక్ డ్రెస్సులో శ్రీవల్లి ఎంత అందంగా ఉందో చూశారా?

అయితే ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రతి సినిమాకి మినిమమ్ రెండేళ్లు గ్యాప్ తీసుకునే వంశీ ఇప్పుడు ఒక హిందీ స్టార్ హీరోను ఫిక్స్ చేసుకుని సినిమా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు షాహిద్ కపూర్ కి వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సినిమాను ప్రధానంగా హిందీ-తెలుగు భాషల్లో తెరకెక్కించి ఇతర భాషల్లో డబ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్లో నిర్మించే అవకాశం ఉంది. నిజానికి దిల్ రాజు షాహిద్ హీరోగా హిందీలో జెర్సీ అనే సినిమా చేశాడు. మన తెలుగు జెర్సీని హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇక అదే హీరోతో దిల్ రాజు మరో సినిమా చేయనున్నాడు అది కూడా తన ఆస్థాన దర్శకుడు వంశీ పైడిపల్లితో.

Exit mobile version