NTV Telugu Site icon

Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు

Sarkaaru Vaari Paata

Sarkaaru Vaari Paata

మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్‌కు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దర్శకుడు పరశురాం తనకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసని.. అతడు కష్టపడే విధానం తనను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపాడు. సర్కారు వారి పాట ట్రైలర్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ అనేలా పరశురాం ఈ సినిమాను తెరకెక్కించాడని వంశీ పైడిపల్లి ప్రశంసించాడు. గీత గోవిందం సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పరశురాం ఈనెల 12న విడుదల కానున్న ఈ మూవీ పరశురాం మెమరబుల్‌గా నిలిచిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు.

అటు దర్శకుడు తమన్ గురించి వంశీ పైడిపల్లి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సర్కారువారిపాట సినిమా కోసం తమన్ అన్ని సినిమాలను పక్కన పెట్టేశాడని.. అందులో తన సినిమా కూడా ఉందన్నాడు. తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడని కొనియాడాడు. 12 ఏళ్ల నుంచి కష్టపడి తమన్ ఈ స్థాయికి చేరుకున్నాడని.. ఈ రోజు తమన్ గురించి ఎవరైనా గర్వపడుతున్నాడంటే అది వాళ్ల తల్లిదండ్రులేనని వంశీ పైడిపల్లి పేర్కొన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాతో సక్సెస్ కంటిన్యూ చేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపాడు. హీరో మహేష్‌బాబుతో తాను మహర్షి సినిమా చేశానని.. తన జీవితంలో మహేష్ తనకు ఇచ్చిన స్థానంపై ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నాడు. తనను స్నేహితుడిగా భావిస్తున్న మహేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Sarkaru Vaari Paata Pre Release Event LIVE | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram|Ntv