Site icon NTV Telugu

Waltair Seenu: ‘వాల్తేరు శీను’ లుక్‌ అదిరింది

sumanth

sumanth

సుమంత్‌, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్‌ క్రియేషన్స్‌ పతాకంపై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ తుది దశలో ఉంది. బుధవారం సుమంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌ లుక్‌ను విడుదలచేశారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్‌ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. మధు నందన్‌, హైపర్‌ ఆది, మిర్చి కిరణ్‌, కళ్యాణ్‌, ధనరాజ్‌, రఘు కారుమంచి, సిజ్జు, ప్రభ (సీనియర్‌ నటి) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌.కె.రాబిన్స్‌, పి.ఆర్‌.ఓ: వి.ఆర్‌.మధు.

Exit mobile version