కోలీవుడ్ తల అజిత్ కుమార్ భారీ యాక్షన్ డ్రామా ‘వాలిమై’ ప్రకటించినప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు ఇతర భాషల్లో ఉన్న అజిత్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనీ చిత్రబృందం అనుకుంది. కానీ అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయాలనుకుంటున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్ ను రివీల్ చేశారు. ‘వాలిమై’ చిత్రానికి తెలుగులో ‘బలం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. తమిళంలో ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. తెలుగులో రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు హీరో కార్తికేయ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘వాలిమై’లో హుమా ఖురేషి, యోగి బాబుతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు.
