Site icon NTV Telugu

Vaishnavi Chaitanya: దిల్ రాజు వారసుడి కోసం బేబీ రంగంలోకి దిగిందోచ్

Vaishnavi With Asish Reddy

Vaishnavi With Asish Reddy

Vaishnavi Chaitanya with Asish Reddy: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. సినిమాలో ఆమె నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ‘బేబీ’ సినిమా తర్వాత వైష్ణవి వెంటనే అవకాశాలు రాలేదు అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ ‘బేబీ’ కాంబోలోనే ఒక సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమా చేస్తోంది. సాయి రాజేష్ ఈ సినిమాకు కథను అందించగా నంబూరు రవి దర్శకత్వం వహిస్తున్నారు.

SSMB 29: రెస్ట్ మోడ్ అయింది.. పని మొదలెట్టిన జక్కన్న

ఎస్‌కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలయ్యింది.ఇక ఇపుడు వైష్ణవి మరో క్రేజీ ఆఫర్ కు ఓకే చెప్పింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న మూడో సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా ఎంపిక అయ్యింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి “రౌడీ బాయ్స్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం “సెల్ఫిష్” అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనే ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

Exit mobile version