Vaishnavi Chaitanya: ప్రాణం పెట్టి చేశా.. కొంచెం మీటర్ తప్పినా ఇక అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Thank You Meet: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ సినిమా జూలై 14న రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రాగా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టడంతో ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దర్శకత్వం వహించిన సాయి రాజేష్, నటీనటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ వంటి వారు పాల్గొని మాట్లాడారు. ఇక ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ పెద్ద స్క్రీన్‌కు మేం కొత్త, జనాలకు ఇంకా అలవాటు కాలేదు కానీ చిన్న సినిమాల్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా బేబీ నిలిచిందని విన్నానని అన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పిన ఆయన సంథ్య థియేటర్లో మొదటి సారిగా సినిమాను చూశా, రియాక్షన్ ఎలా ఉంటుందా? అని చూస్తే ప్రతీ సీన్‌కు వేరే లెవెల్లో రియాక్షన్స్ ఇచ్చారని అన్నారు. బేబీ అనేది రియాల్టీ ఉన్న బోల్డ్ కంటెంట్ అని, ఇలాంటివి ఎంతో మంది జీవితాల్లో జరిగి ఉంటాయని అన్నారు. ఇక ఈ కథ, పాత్ర విన్నప్పుడు నాకు భయం వేయలేదు కానీ ఎగ్జైటింగ్‌గా అనిపించిందని పేర్కొన్న ఆనంద్ మేం ఎంతగా నటించినా కూడా సాయి రాజేష్ అన్న రైటింగ్ వల్లే అదంతా సాధమ్యైందని, ఇంత మంచి పాత్రను, ఇంత మంచి సినిమాను ఇచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్ చెప్పారు.
‘Baby the Movie: నేను అనుభవించిన ఎనిమిది నెలల ప్రేమ నరకమే ‘బేబీ’: డైరెక్టర్ సాయి రాజేష్
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
Vaishnavi Chaitanya Speech At Baby Thank You Meet: ఇక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘జూలై 14న మా జీవితాంతం గుర్తుండి పోతుందని, ఎందుకంటే ఎంతో ఆనందంగా ఉన్నామని, గర్వంగా అనిపిస్తోందని అన్నారు. ప్రతీ డైలాగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారని, అరుపులు, విజిల్స్, క్లాప్స్ కొడుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుందని అన్నారు. నేను ఫ్యూచర్ సినిమాల గురించి, నా పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించలేదని పేరొన్న ఆమె బేబీ అనేది నా మొదటి సినిమా అని దాని కోసం ప్రాణం పెట్టి చేశానని అన్నారు. బేబీ సినిమాలో నేను చేసిన పాత్రను పోషించడం అంత సులభం కాదని, కొంచెం మీటర్ తప్పినా మీనింగ్ తప్పైపోతుందని కానీ డైరెక్టర్ చెప్పిన మీటర్ నాకు చాలా నచ్చిందని అన్నారు.ఇంత బాగా నటించగలవా? అని నా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారని ఆమె అన్నారు. ఇక మరో నటుడు విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘బేబీ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పాడు. ఈ విజయాన్ని చూస్తే ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉందని, మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్ చెప్పిన ఆయన చాలా మంది బేబీని సపోర్ట్ చేశారని, ఈ రోజు ఇలాంటి సక్సెస్ కోసం మా టీం అంతా కష్టపడిందని అన్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!